దేవర ట్రైలర్ వచ్చేసింది.. సినిమా పై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ముంబై లో దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ లుక్స్, ఆయన మాట్లాడిన విదానానికి కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారనడంలో సందేహం లేదు.
కరణ్ జోహార్ హాండ్స్ లోకి దేవర వెళ్లడం, ముంబైలో దేవర ప్రమోషన్స్ అన్ని దేవర పై అంచనాలు పెరిగిపోయేలా చేసాయి. దేవర ట్రైలర్ తోనే సంబరపడిపోతే ఎలా.. ఆనందం ముందుంది అంటూ కనిపించిన ఓ ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది. ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా, ఇప్పుడే మొదలు.. ఆయుధపూజ పాట వస్తే ఇంక పట్టలేం మిమ్మల్ని.. ఆ ..🔥🔥🔥🔥 అంటూ లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ దేవర పై మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఆ దేవర ఆయుధపూజ సాంగ్ మేకింగ్ దగ్గర నుంచే దానిపై క్రేజీగా ఇస్తున్న అప్ డేట్స్ ఆ సాంగ్ పై విపరీతమైన అంచనాలు పెంచగా.. ఇప్పడు జోగయ్య శాస్త్రి గారు చేసిన ట్వీట్ దానికి డబుల్ హైప్ పెంచింది. మరి ఈ పది రోజులు దేవర హడావిడి ఏ రేంజ్ లో ఉండబోతుందో చూద్దాం.