Advertisement
TDP Ads

మంత్ర కలశాలతో ప్రసన్నవదనునికి ప్రముఖ రచయిత శ్రీనివాస్ అక్షరాభిషేకం

Sat 14th Sep 2024 07:27 PM
puranapanda srinivas,gananam tva,book  మంత్ర కలశాలతో ప్రసన్నవదనునికి ప్రముఖ రచయిత శ్రీనివాస్ అక్షరాభిషేకం
Aksharabhishekam by famous writer Srinivas to Prasannavadana with Mantra Kalasha మంత్ర కలశాలతో ప్రసన్నవదనునికి ప్రముఖ రచయిత శ్రీనివాస్ అక్షరాభిషేకం
Advertisement

యుగ యుగాల అనాది సనాతన ధర్మంలోని అనేక అద్భుతాలను శాస్త్ర ప్రమాణాల సమన్వయంతో వివిధ కాలాలలో అపురూప రచనా సంకలనాల అద్భుత గ్రంథాలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా మహాద్భుతంగా అందించిన మహా గాణపత్య గ్రంధం ‘గణానాం త్వా’ (Gananam Tva) సాధికారిక విలువలతో అందించడం అభినందనీయమని ఆలయాల పండిత, అర్చక, ప్రవచనకర్తల ప్రముఖులు శ్రీనివాస్‌పై ప్రశంసలు వర్షిస్తున్నారు.

విఖ్యాత వైద్యసేవల సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) సౌజన్యంతో తెలంగాణా, ఆంధ్రరాష్ట్రాలలోని పలు గణపతి నవరాత్రోత్సవ వేదికలపై వైదిక వినాయక మంత్రమయ జ్ఞాపికగా అనేకమంది విజ్ఞులకు అందించడం విశేషంగా అనేకమంది రాజకీయ, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు సైతం పుస్తక వైభవానికి జేజేలు పలుకుతున్నారు.

తిరుమల వేంకటాచల క్షేత్రం ప్రధానార్చకులు ఏ. వేణుగోపాల దీక్షితులు (A Venugopala Deekshithulu), జస్టిస్ కాశీ విశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి, ప్రముఖ రాజకీయ వేత్తలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీశాసనసభ్యులు జక్కంపూడి రాజా, ఆరామ ద్రావిడ బ్రాహ్మణసంఘ ప్రముఖులు ఆకుండి సూర్య తదితరప్రముఖుల వందల ప్రతులు వితరణచేయడం ఆయా ప్రాంతాలలో విశేషంగా ఈ పవిత్రగ్రంథం ఆకట్టుకోవడం విశేషమంటున్నారు విశ్వహిందూపరిషత్, ఆరెస్సెస్ రాష్ట్రనాయకులు.  

ఇదిలా ఉండగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా తెలుగువారి ప్రతిష్ట ఎగురవేసిన ఖైరతాబాద్ గణపతి అనుగ్రహంతో ఖైరతాబాద్ మహాగణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఈ రెండు గ్రంధాలను దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు స్వయంగా అందివ్వడం ఈ సంవత్సరం ప్రత్యేకాంశంగా చెప్పక తప్పదు. అద్భుతాల, మంగళాల, వరాల, సౌందర్యాల్ని విరజిమ్మే విఘ్నేశ్వరుని సంచికలతో ప్రతీఏటా సంచలనం సృష్టిస్తున్న శ్రీశైలదేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఇంతటి పవిత్ర ఘనకార్యానికి వెనుక బొల్లినేని కృష్ణయ్య, ‘కల్కి 2898AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తల్లిదండ్రులు జయంతిరెడ్డి , జయరామిరెడ్డి మాత్రమేకాకుండా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆప్తుడిగా పేరొందిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి (Sai Korrapati) సద్భక్తితో ఈ మంత్రకార్యానికి సమర్పకులుగా వ్యవహరించడాన్ని సినీ రాజకీయ పండిత ప్రముఖులు పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటున్నారు. (Gnana Mahayagna Kendram)

Aksharabhishekam by famous writer Srinivas to Prasannavadana with Mantra Kalasha:

Famous Writer Puranapanda Srinivas Gananam Tva Book to Devotees

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement