ఆర్.ఆర్.ఆర్ తరవాత రామ్ చరణ్ నుంచి రాబోయే బిగ్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ దర్శకుడు శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. వినాయక చవితికి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇస్తారు అనుకుంటే సెకండ్ సింగిల్ పోస్టర్ తో సరిపెట్టడం వారిని డిజ్ పాయింట్ చేసింది.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రం మొత్తం పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుంది అనుకుంటున్నారేమో.. కాదు కాదు గేమ్ ఛేంజర్ లో అదిరిపోయే రేంజ్ లో భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా పూణే ట్రైన్ ఫైట్ ఒకటి అని చెబుతున్నారు.
అంతేకాకుండా 1200 జూనియర్ ఆర్టిస్టులతో రామ్ చరణ్ తలపడే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమట. అలాగే 500 మందితో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పై మాస్ ఎలివేషన్స్ ఉంటాయని చెబుతున్నారు. సో విలన్ సూర్య స్టైలిష్ పాత్రలో కనిపిస్తుండగా.. రామ్ చరణ్ క్లాస్ లుక్ లోనే మాస్ గా యక్షన్ ఇరగదీస్తాడని చెబుతున్నారు.