గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా జరుగుతుంది. ఒకరిపై ఒకరు అలిగేషన్స్ చేసుకుంటూ నామినేట్ చెయ్యడమే కాదు, డస్ట్ బిన్ కోసం, కిచెన్ లో వర్క్ కోసం ఇలా నామినేషన్ రీజన్స్ ఉన్నాయి. క్లాన్ లోని హౌస్ మేట్స్ సరిగ్గా లేరు అంటూ నామినేట్ చేసుకోవడం, సిల్లీ రీజన్స్ తో నామినేట్ చెయ్యడం కామెడీగా మారింది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ని బలమైన క్లాన్ కెప్టెన్ అయిన యష్మి కి ఇచ్చారు. మరి ఆమె ఎవరిని సేవ్ చేస్తుందా అనేది ఎవరు పెద్దగా ఆలోచించలేదు. కారణం నామినేషన్స్ లో ఉన్న వారిలో యష్మి ఫ్రెండ్ ప్రేరణ ఉంది. యష్మి ఖచ్చితంగా ప్రేరణనే సేవ్ చేస్తుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు.
యష్మి-ప్రేరణ ఓ సీరియల్ లో కలిసి కనిపించారు. ఇద్దరూ కన్నడ అమ్మాయిలు. ఈ హౌస్ లోకి ఫ్రెండ్స్ గా అడుగుపెట్టిన ఇద్దరూ ఇక్కడ కూడా అంటే హౌస్ లోను ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు అనడానికి ఈ ఉదాహరణ చాలేమో. అందుకే ప్రేరరణకు ఎక్కువ ఓట్స్ పడినా యష్మి ఆలోచన లేకుండా ప్రేరణని సేవ్ చేస్తూ ఆమె ప్లేస్ లో విష్ణు ప్రియని నేరుగా నామినేట్ చెయ్యడం హౌస్ మేట్స్ కి నచ్చలేదు.
హౌస్ లో గేమ్ ని గేమ్ లా ఆడాలి, ఫ్రెండ్ షిప్ ఉంటే బయట చూసుకోవాలి కానీ ఇలా హెల్ప్ చెయ్యడమేమిటో అంటూ మిగతా హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారు.