కాజల్ పెళ్లి చేసుకుని బాబు కు జన్మనిచ్చాక కూడా ఆమెకి అవకాశాల వెల్లువ మాత్రం తగ్గడం లేదు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కాజల్ కి ఆఫర్స్ తలుపు తడుతూనే ఉన్నాయి. కాజల్ పెళ్లి తర్వాత నటించిన సినిమాల్లో బాలయ్య భగవంత్ కేసరి మాత్రమే హిట్. సత్యభామ, ఇండియన్ 2 కాజల్ ను బాగా నిరాశ పరిచాయి.
అయినప్పటికీ కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది. అది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సికిందర్ లో కాజల్ కు హీరోయిన్ గా ఛాన్స్ తగిలింది అని చెప్పుకుంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ చేస్తున్న సికిందర్ లో ఆల్రెడీ రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపికయ్యింది.
ఇప్పుడు మరో హీరోయిన్ కేరెక్టర్ కి కాజల్ ని తీసుకున్నారట. భారీ యాక్షన్ ఎంటన్ టైనర్ గా మురగదాస్ సికిందర్ ని మలుస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాజల్ కి ఈ చిత్రంలో అవకాశం రావడంతో అందరూ సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కి లక్కీ ఛాన్స్ అని చెప్పుకుంటున్నారు.