యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో ఈనెల 27 న విడుదల కాబోతున్న దేవర మూవీ ఎలా ఉండబోతుంది, అసలు దేవర కాన్సెప్ట్ ఏమిటి అనేది ఈరోజు వదిలిన దేవర ట్రైలర్ తో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ముంబై వేదికగా ఎన్టీఆర్-కొరటాల లు అతిరథమహారదుల నడుమ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక దేవర ట్రైలర్ మాస్, యాక్షన్ ఫిలిం గా దేవరను పరిచయం చేసింది. దేవర ట్రైలర్ చివరి షాట్ లో ఎన్టీఆర్ షార్క్ వాటర్ ఫైట్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో సందేహమే లేదు. అయితే ఆ షాట్ బాగా రావడానికి ఎన్టీఆర్ దాదాపు ఒక రోజు మొత్తం వాటర్ టబ్ లోనే ఉండిపోయిన విషయాన్ని స్వయానా ఎన్టీఆర్ దేవర ఈవెంట్ లో బయటపెట్టాడు.
ఆ షాట్ తియ్యడానికి చాలా కష్టమైంది. దేవర లో ఎక్కువ టైమ్ తీసుకున్న సీక్వెన్స్ అదే. ఆ ఒక్క షాట్ కోసం 200 అడుగుల పొడుగు, 100 అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల టబ్ లో దిగాను, ఆ షాట్ ఓకె అవడం కోసం ఒకరోజు సమయం పట్టింది. ఆ షార్క్ ఫైట్ దేవర చిత్రంలో మెయిన్ హైలెట్ అవడం ఖాయమంటూ ఎన్టీఆర్ మరింత హైప్ పెంచేసాడు.