రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ వచ్చే శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోపు రాజ్ తరుణ్ పర్సనల్ వ్యవహారం ముదిరి పాకనపడింది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తనని మోసం చేసాడు అంటూ పెట్టిన కేసు పై రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చేసారు. దానితో ఇంతకు ముందు అరెస్ట్ అవకుండా బెయిల్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు ఏ క్షణాన అయినా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది.
ఈలోపు రాజ్ తరుణ్ ముంబై లో మాల్వి మల్హోత్రా తో కలిసి ఉన్న సమయంలో లావణ్య హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన సంచనలం సృష్టించింది. ఆతర్వాత లావణ్య తన పేరెంట్స్ రాజ్ తరుణ్ కు 70 లక్షలు ఇచ్చారు. గత రెండేళ్లుగా రాజ్ తరుణ్ కు సినిమాలేవీ లేకపోవడంతో అతనికి తన తల్లితండ్రులు 70 లక్షలిచ్చారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఇప్పుడు రాజ్ తరుణ్ తన బంగారంతో పాటుగా తన తాళి బొట్టు ను కూడా దొంగిలించాడు, నా బంగారం మొత్తం 12 లక్షలకు పై మాటే ఉంటుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నా ఇంట్లో 12 లక్షల విలువైన బంగారాన్ని దొంగలించారు, నా మనిషిని నా బంగారాన్ని మాల్వి పట్టుకుపోయింది అంటూ మరోసారి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.