యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబైలో సందడి చేస్తున్నారు. ఈరోజు దేవర ట్రైలర్ లాంచ్ కోసం, అలాగే దేవర ను ముంబై లో ప్రమోట్ చేసేందుకు రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్ ముంబై వెళ్లిపోయాడు. అక్కడ ఆయన నిన్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ వంగాను మీటయ్యాడు. దానితో సందీప్ ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడనే టాక్ వినిపించింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ కపిల్ శర్మ షోకి వెళ్ళాడు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో సహా దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. గత రాత్రి కరణ్ హాజరయ్యాడు. అక్కడే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అప్ కమింగ్ దర్శకులతో దిగిన పిక్ వైరల్ గా మారింది. దేవర డైరెక్టర్ కొరటాల, NTR31 దర్శకుడు ప్రశాంత్ నీల్, అలాగే వార్ 2 డైరెక్టర్ అయన్ తో కలిసి ఎన్టీఆర్ దిగిన పిక్ నెట్టింట సంచలనంగా మారింది.
ముగ్గురు క్రేజీ దర్శకులు కావడంతో ఆ టాపిక్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ తెగ పొంగిపోతున్నారు. ముగ్గురు మాస్ కథలతోనే ఎన్టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ అంతగా ఎగ్జైట్ అవుతున్నారు.