యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ ఇంకా రాలేదు, అప్పుడే రికార్డుల వేట షురూ చేసింది. ఈ నెల 27 న పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. తాజాగా దేవర తొలి ఇండియన్ మూవీ గా అరుదైన రికార్డును నెలకొల్పింది. రీసెంట్ గానే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా టికెట్ల బుకింగ్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.
అలా బుకింగ్స్ ఓపెన్ చేసారో లేదో.. ఇలా దేవర టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలవడానికి ముందే ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ తో దేవర మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా ఒక మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్న సినిమాగా దేవర రికార్డును నెలకొల్పింది.
మరి ఇలాంటి వార్తలతో దేవర కి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహమేలేదు. ఈరోజు ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు ఇంకెంతగా పెరుగుతాయో అనే అతృతతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో దేవర ట్రైలర్ కు ముంబై వేదికగా ముహూర్తం పెట్టారు.