గత గురువారం వినాయక చవితి సందర్భంగా విడుదలైన కోలీవుడ్ హీరో విజయ్ నటించిన GOAT చిత్రం తెలుగులో నిరాశపరచగా.. ఆ తర్వాత శుక్రవారం విడుదలైన 35 చిన్న కథ కాదు సూపర్ హిట్ అయ్యింది. వినాయకచవితి రోజు అంటే శనివారం విడుదలైన ఉరుకు పటేలా అసలు వార్తల్లో లేకుండా పోయింది.
ఇక ఈ వారం చిన్న సినిమాల జాతరకు వేళయ్యింది. అందులో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే, సింహ కోడూరి-సత్యల మత్తు వదలరా 2, ధూం ధాం, ఉత్సవం, హైడ్ అండ్ సీక్, మలయాళ డబ్బింగ్ మూవీ ARM వంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి.
వాటితో పాటుగా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు వివిధరకాల ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఈ వీక్ సందడి చేసే ఓటీటీ కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు..
నెట్ ఫ్లిక్స్:
మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ) సెప్టెంబర్ 12
సెక్టార్ 36 – సెప్టెంబర్ 13
ఆయ్ (తెలుగు మూవీ) సెప్టెంబర్ 12
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ సెప్టెంబర్ 13
ఈటీవీ విన్ :
కమిటీ కుర్రాళ్ళు (తెలుగు మూవీ) సెప్టెంబర్ 12
సోనీలివ్ :
తలవాన్ సెప్టెంబర్ 10
జీ 5:
నునాకుజి సెప్టెంబర్ 13
బెర్లిన్ సెప్టెంబర్ 13