సోషల్ మీడియాలో దేవర ఫీవర్ మొదలైపోయింది. ఓవర్సీస్ లో దేవర బుకింగ్స్, ప్రీ సేల్స్ అంటూ మేకర్స్ ఊదరగొట్టేస్తున్నారు. మరోపక్క ముంబై లో దేవర ప్రమోషన్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ లు కలియదిరగడం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. నిన్న కపిల్ శర్మ షోకి అటెండ్ అయిన టీమ్ ఈరోజు ట్రైలర్ కోసం రెడీ అవుతుంది.
అయితే దేవర ముందుగా నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ముందుగా ముంబై నుంచి దేవర ప్రమోషన్స్ మొదలు పెట్టి తమ స్ట్రాటజీని బయటపెట్టారు. అంతేకాదు దేవర కు ఎన్టీఆర్ ముంబై ఎంట్రీ అదేనండి బాలీవుడ్ ఎంట్రీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వార్ 2 కోసం ఎన్టీఆర్ కొద్దిరోజులుగా ముంబై కి వెళ్ళటం, హృతిక్ రోషన్ తో కలిసి సెట్స్ లో కనిపించడం అన్ని నార్త్ ఆడియన్స్ లో దేవర పై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.
హృతిక్ ఫ్యాన్స్ దేవర పై ఖచ్చితముగా ఇంట్రస్ట్ చూపిస్తారనడంలో సందేహం లేదు. అది నార్త్ లో దేవర కి హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు, మరోపక్క కరణ్ జోహార్ హాండ్స్ దేవర బాలీవుడ్ రిలీజ్ విషయంలో ప్రధాన బలం. సో దేవర బాలీవుడ్ లో వర్కౌట్ అవుతుంది, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.