బిగ్ బాస్ సీజన్ 8 లోకి మొదటిరోజు 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. స్టార్ మా సీరియల్స్ నటులు, సోషల్ మీడియాలో పేరున్న వారు ఈ సీజన్ లోకి వచ్చారు. వారు హౌస్ లోకి అడుగుపెట్టడమే తరువాయి స్ట్రాటజీలు మొదలు పెట్టేసి గొడవలు పడిపోతూ హైలెట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు గేమ్ మీద కంటే రచ్చ విషయంలోనే అలెర్ట్ గా కనబడుతున్నారు.
ఇక సీజన్ 8 మొదలై వారం పూర్తయ్యింది. మొదటగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది. హౌస్‌లో ఆమె ఓవర్ యాక్షన్ చేసిందని మెజార్టీ ఆడియన్స్ భావించి ఆమెకి ఓట్స్ వేయలేదు. ఇక ఆమె ఎలిమినేట్ అవడంతో ఆమె ప్లేస్ లోకి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు.
మొదట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ రీతూ చౌదరి పేరు వినిపించినప్పటికి, తర్వాత రితూ చౌదరిని కాకుండా మరో భామను హౌస్‌లోకి తీసుకురావడానికి బిగ్‌బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి గా పాపులర్ అయిన జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత జ్యోతి గ్లామర్ షోకి తెర లేపింది. అలాంటి ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తే ఆమె అందాలను చూపిస్తూ గేమ్ ని ఎలా ఆడుతుందో అని బుల్లితెర ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతున్నారు.