Advertisementt

పర్ఫెక్ట్ స్ట్రాటజీ తో ఎన్టీఆర్ దేవర

Mon 09th Sep 2024 09:02 PM
devara  పర్ఫెక్ట్ స్ట్రాటజీ తో ఎన్టీఆర్ దేవర
NTR perfect strategy for Devara పర్ఫెక్ట్ స్ట్రాటజీ తో ఎన్టీఆర్ దేవర
Advertisement
Ads by CJ

నిన్నటివరకు దేవర టీమ్ ప్రమోషన్స్ విషయంలో లైట్ గా ఉండడం చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడిపోయారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. కారణం దేవర ముంబై ప్రమోషన్స్ చూసి వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ముంబై లో యంగ్ టైగర్ కలియతిరుగుతున్న తీరుకు ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు. 

ఈరోజు ముంబై లో ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా ను మీటవడం దగ్గర నుంచి కపిల్ శర్మ షోకి దేవర టీమ్ వెళ్లడం వరకు అన్ని సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈరోజు వేసిన ప్రతి అవుట్ ఫిట్ లో ఎన్టీఆర్ లుక్స్ హ్యాండ్ సమ్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. 

రేపు మంగళవారం సాయంత్రం 5గంటలకు దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్-జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్ ఇలా టీమ్ అంతా రెడీ అవుతుంది. ఆ తర్వాత ముంబై లో ఒకటి రెండు ఇంటర్వూస్ ఇచ్చేసి తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలా దేవర ని పక్కాగా ప్రమోట్ చేసే ప్లాన్ లో దేవర టీమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది విన్నవారు దేవర పర్ఫెక్ట్ స్ట్రాటజీ లో ముందుకెళుతుంది. 

NTR perfect strategy for Devara:

NTR is in plans to attain a pan-Indian image with Devara

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ