Advertisementt

రశ్మికకు యాక్సిడెంట్

Mon 09th Sep 2024 07:33 PM
rashmika mandanna  రశ్మికకు యాక్సిడెంట్
Rashmika confirms meeting with a minor accident రశ్మికకు యాక్సిడెంట్
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. పర్సనల్ విషయాలు, ఫొటోస్ షూట్స్, సినిమా విశేషాలు ఇలా ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే ఆమె అభిమానులకు చేరవేస్తుంది. అయితే కొద్దిరోజులుగా రష్మిక సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా లేదు. 

కారణం రష్మిక మందన్న కు యాక్సిడెంట్ అయ్యిందట. ఆ విషయం స్వయానా రష్మిక మందన్న నే బయటపెట్టింది. నేను గత నెలలో సోషల్ మీడియాలోనూ, పబ్లిక్ లోను అంతగా యాక్టీవ్ గా లేకపోవడానికి కారణం నాకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. చిన్న యాక్సిడెంట్ అయినా డాక్టర్స్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమన్నారు. 

ప్రస్తుతం కోలుకుంటున్నాను, ఇప్పుడు నా హెల్త్ మెరుగవుతుంది. అందుకే లైఫ్ ఎప్పుడెలా ఉంటుందో తెలియదు, ఉన్న రోజును హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యాలి, రేపు అనేది మన చేతిలో ఉండదు అంటూ రష్మిక తనకు జరిగిన యాక్సిడెంట్ విషయాన్ని ఓ పిక్ తో రివీల్ చేసింది. 

Rashmika confirms meeting with a minor accident:

Rashmika Mandanna confirms meeting with a minor accident

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ