ఎవరైనా హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా హిట్ అవ్వకపోతే ఆ హీరోయిన్ వైపు ఏ హీరో కూడా చూడరు. కానీ అలా ప్లాప్ కొట్టిన హీరోయిన్ కి ఓ స్టార్ హీరో అవకాశం ఇస్తే మాత్రం నిజంగా ఆమెని లక్కీ అనక మానరు. మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ సినిమా డిసాస్టర్ తరవాత ఆమె గురించి ఎవరూ మాట్లాడుకోకుండా చేసింది.
గ్లామర్ కి గ్లామర్, డాన్స్ కి డాన్స్ తో అదరగొట్టి మరో శ్రీలీల అవుతుంది అనుకున్నారు. కానీ ఆమె గ్లామర్, ఆమె డాన్స్ మిస్టర్ బచ్చన్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. కంటెంట్ లో బలం లేకపోవడంతో మిస్టర్ బచ్చన్ ప్లాప్ లిస్ట్ లోకి చేరింది. దానితో భాగ్యశ్రీ బోర్సే ని ఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు పాపకు ఓ లక్కీ ఛాన్స్ దొరికింది. అదే టాలీవుడ్ హీరో రానా నిర్మాతగా మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న కాంత లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఎంపికవడమే కాదు.. రీసెంట్ గా కాంత మూవీ పూజ కార్యక్రమాలతో మొదలైంది కూడా. అది చూసిన చాలామంది మొదటి సినిమా ప్లాప్ అయినా పాప లక్కీ కాబట్టే దుల్కర్ లాంటి స్టార్ సరసన ఛాన్స్ దొరికింది అంటున్నారు.