ఏపీ గత వారం రోజులుగా వరదలతో అతలాకుతలం అవుతుంది. శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు, వరదలు తో ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతగా సహాయక చర్యలు చేపట్టినా నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు అంతా నాశనం అవుతుంది. సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతూ ప్రజలకు సహాయక చర్యలు అందుతున్నాయో లేదా నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వర్షాన్ని సైతం ఇక చెయ్యకుండా బుడమేరు గండ్లు పూడ్చే పనిలో తలమునకలై ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం ఫైట్ చేసే జగన్ ఓ రెండు రోజులు ప్రజల్లోకి వచ్చి వారిని పలకరించి ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలుతూ ప్రస్తుతం బెంగుళూరు ప్యాలెస్ కి పరిమితమయ్యారు.
కనీసం ప్రజలకు తమవంతు సాయం చేద్దామని వైసీపీ నేతలకు లేకపోగా.. ప్రభుత్వ కష్టాన్ని అవహేళన చేస్తున్నారు. బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుని సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్న జగన్ అక్కడ కాంగ్రెస్ నాయకులకు విందు ఇచ్చారనే న్యూస్ వైరల్ గా మారింది. ప్రజలను వరదల్లో వదిలేసి తాను మాత్రం విందులతో బిజీగా గడపడం ఎంతవరకు న్యాయం.
ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ప్రజలను పట్టించుకోరా.. జగన్ రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపించేసరికి బ్లూ మీడియా రెచ్చిపోయి జగన్ మారిపోయాడు, గత ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసాడు, ఇక వైసీపీ కి పూర్వ వైభవం వచ్చేసింది అంటూ చంకలు గుద్దేసుకుంది. కట్ చేస్తే జగన్ మళ్ళి బెంగుళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.