Advertisementt

స్మార్ట్ గా ఆలోచిస్తున్న పూజ హెగ్డే

Mon 09th Sep 2024 11:01 AM
deva  స్మార్ట్ గా ఆలోచిస్తున్న పూజ హెగ్డే
Smart thinking Pooja Hegde స్మార్ట్ గా ఆలోచిస్తున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజ హెగ్డే కు ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు సన్నగిల్లాయి. వరస ప్లాప్ లు పూజ హెగ్డే ను నిరాశలోకి నెట్టేశాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఒకేసారి పూజాహెగ్డే ని నిరాశపరచడంతో కెరీర్ లో బాగా స్లో అయ్యింది పాప. సౌత్ లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో పూజ హెగ్డే ఓ స్మార్ట్ డెసిషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. 

అదే పూజ హెగ్డే తన పారితోషికం కాస్త తగ్గించింది అంటున్నారు. గత ఏడాది వరకు కోట్లలో రెమ్యునరేషన్ అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు కోటి కంటే చాలా తక్కువగానే పారితోషికం తీసుకుంటుందంట. ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల అవకాశాలు వచ్చినా పూజ హెగ్డే ఓకె చెప్పడానికి సిద్దమైందని టాక్. 

ఈమధ్యనే తమిళనాట సూర్య చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. మరోపక్క  హిందీలో షాహిద్ కపూర్ కి జోడీగా దేవ్ అనే సినిమాని పూజా హెగ్డే కంప్లీట్ చేసింది. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా కోసం పూజా హెగ్డేని ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. 

Smart thinking Pooja Hegde:

Pooja Hedge To Reduce Her Remuneration

Tags:   DEVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ