దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అనేది గత రెండు నెలలుగా మీడియాలో చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ తన భర్య వాణి ని వదిలేసి దివ్వెల మధురితో కలిసి ఉండడమే కాదు.. శ్రీనివాస్ తన ఆస్తులన్నీ ముఖ్యంగా టెక్కలిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని మాధురి కి ఇచ్చేస్తున్నాడు, అదంతా తన డబ్బుతో కట్టిన ఇల్లు అని వాణి ఆరోపిస్తుంది.
నేను మాధురి కి రెండు కోట్లు అప్పు ఉన్నాను, ఎలక్షన్ సమయంలో ఆమె తనకు రెండు కోట్లు డబ్బిచ్చింది, అందుకే నా ఆస్తి మధురికే అని చెబుతూ వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ ఫైనల్ గా టెక్కలి ఇంటి కథను తేల్చేసాడు. అటు దివ్వెల మాధురి కూడా సైలెంట్ గా తనకి కావాల్సింది చేయించేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది మాధురి.
అదే ఇంటి కోసం దువ్వాడ వాణి ఫైట్ చేస్తుంది. కానీ ఫైనల్ గా అది మాధురి చేతికి వెళ్లడం ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని లైవ్ లోనే శ్రీనివాస్ తో ఫోన్ మాట్లాడి కన్ ఫర్మ్ చెయ్యడం అన్ని మాధురి చాలా చాకచక్యంగా చేసేసింది. రిజిస్టిస్ట్రేషన్ అంతా ఆయిపోయాక, ఆ ఇంటి పత్రాలు చేతికి వచ్చాక అది తన ఇల్లు అంటూ టెక్కలి ఇంట్లోకి దివ్వెల మాధురీ అడుగుపెట్టింది.
అయితే శ్రీనివాస్ తాను మాధురి దగ్గర రెండు కోట్లు అప్పు తీసుకున్నాను, అది ఎన్నికల సమయంలో ఒకసారి, ఈ ఇంటి నిర్మాణం కోసం ఇంకోసారి మాధురి దగ్గర డబ్బు తీసుకున్నాను, అందుకే మాధురి కి తన ఇంటిని రాసిచ్చాను అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఇది తన ఇల్లు అని.. కావాలంటే దువ్వాడ తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అద్దెకు ఇస్తానని దివ్వెల మాధురీ ఖరాఖండిగా చెప్పేసింది.