చక్కటికథలను ఎంచుకుంటూ ట్రెడిషనల్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్న రీతూ వర్మ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. చక్కటి ఫిగర్, దానికి తగ్గ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టే రీతూ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు తో కలిసి స్వాగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమాలో డిఫ్రెంట్ కేరెక్టర్ లో కనిపించనున్న రీతూ వర్మ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే కుందనపు బొమ్మలా ఉంది అనేస్తారేమో.. అంత చక్కటి అందం, అణుకువ తో రీతూ వర్మ ఫోటో షూట్ కనిపించింది. బ్లూ డ్రెస్ లో రీతూ వర్మ అద్భుతంగా కనిపించింది.
స్వాగ్ ప్రమోషన్స్ స్టార్ట్ అంటూ ఆ ఫొటోస్ షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రీతూ. స్వాగ్ చిత్రంతో పాటుగా ఈ బ్యూటీ విక్రమ్ తో చేసిన ధ్రువ నక్షత్రం కూడా విడుదల కావాల్సి ఉంది.