బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లు తల్లి-తండ్రులయ్యారు. వినాయక చవితికి ఒక రోజు ముందే ముంబై లోని ప్రముఖ సిద్ది వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంటకు పండంటి బిడ్డ పుట్టింది. ఆదివారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీపికా.
డెలివరీ కోసం శనివారం సాయంత్రం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు దీపికాను తీసుకొని రణ్‌వీర్‌సింగ్ వచ్చాడు. బేబీ బంప్‌తో దీపికా కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బాలీవుడ్ జంట జీవితంలోకి లిటిల్ ప్రిన్సెస్ వచ్చింది. తల్లిదండ్రులుగా మారిన రణ్‌వీర్‌సింగ్, దీపికాలకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనే 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత ఈ బాలీవుడ్ జోడీ తల్లిదండ్రులుగా మారారు.