ఆచార్య లాంటి భారీ డిసాస్టర్ తర్వాత కొరటాలకు ఎన్టీఆర్ దేవర ఛాన్స్ ఇవ్వడం పట్ల మొదట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడినా.. ఆతర్వాత ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూసి కామయ్యారు. మధ్య మధ్యలో దేవర నుంచి వదిలిన కంటెంట్ తో వారిలో కూడా నమ్మకం పెరిగింది. పాటల విషయంలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా అవి యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టడంతో ఆ విషయంలో వారిలో టెన్షన్ తగ్గింది.
ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కొరటాల టెన్షన్ పెట్టే పని ఏం చేసారు అంటే.. దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10 న అంటూ ఎన్టీఆర్ లుక్ తో దేవర పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ చూసి చాలామంది ట్రోల్ చెయ్యడమే కాదు.. వేరే సినిమాలో మహిళా పోస్టర్ ని పక్క పక్కనే పెట్టి కాపీ పేస్ట్ అంటూ కామెడీగా మాట్లాడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అందోళనలోకి నెట్టింది.
ఎన్టీఆర్ అలా కనిపించడం, మరీ పెద్దమనిషి మాదిరి ఉండడం నచ్చలేదు, ఎన్టీఆర్ ఫేస్ లో పవర్ ఫుల్ లుక్ ని వారు ఎక్స్ పెక్ట్ చేసారు. కాని మాస్ గా అలా నార్మల్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించేసరికి వారు డిజ్ పాయింట్ అవడమే కాదు.. కొరటాల ఎన్టీఆర్ దేవర ను ఏం చేస్తారో అని వారు ఆందోళన పడిపోతున్నారు.