బాలకృష్ణ కు హీరోయిన్స్ సమస్య అనేది ఇప్పటిది కాదు, గత కొన్ని సినిమాల నుంచి బాలయ్య కు హీరోయిన్స్ దొరకడం లేదు. దానితో దర్శకులు ఏదో ఒక హీరోయిన్ ని తెచ్చి అడ్జెస్ట్ చేస్తున్నారు. బోయపాటి తో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం విషయంలో హీరోయిన్లు చాలామంది బాలయ్య సినిమాని రిజెక్ట్ చేశారనే టాక్ నడిచింది.
ఆ లిస్ట్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఉందట. అప్పట్లో బోయపాటి రకుల్ ప్రీత్ ని సంప్రదించగా ఆమె తనకి హిందీ సినిమాల డేట్స్ విషయంలో అడ్జెక్టు చెయ్యలేను అని బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసింది అనే మాట విప్పుడు వైరల్ అయ్యింది. గతంలో నాగార్జున తో మన్మధుడు 2లో నటించిన రకుల్ కు ఆ సినిమా భారీ షాకే ఇచ్చింది.
ఆతర్వాత రకుల్ తెలుగులో కనిపించింది లేదు. అప్పటి నుంచి ఆమె హిందీ ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యింది. అక్కడ సక్సెస్ లేకపోయినా రకుల్ ముంబైలోనే ఉండిపోయింది. ఇక అఖండ లో రకుల్ తర్వాత కాజల్ ని అడగగా ఆమె పర్సనల్ రీజన్స్ తో రిజెక్ట్ చెయ్యడంతో చివరికి ప్రగ్య జైస్వాల్ కలెక్టర్ పాత్రలోకి వచ్చింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.