నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరో లుక్ తో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ. ఇక ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ సినిమా అనౌన్సమెంట్ వచ్చినా ఇంకా ప్రోపర్ గా పూజా కార్యక్రమాలు జరగలేదు.
అయితే బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలను ఓ రేంజ్ లో అంటే కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారట. అదిరిపోయే ముహూర్తం తో పాటుగా.. సూపర్బ్ అనిపించేలా ఓపెనింగ్ కార్యక్రమాలు చెయ్యబోతున్నారట. ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులను పిలవడమే కాదు, కొంతమంది అభిమానులను కూడా ఆహ్వానించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారట.
సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన వెంటనే సెట్స్ మీదకి వెళ్లేలా ప్రశాంత్ వర్మ కూడా పక్కాగా రెడీ అవుతున్నాడని సమాచారం. దసరా కానీ, కార్తీక మాసంలో కానీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.