బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికి వారం పూర్తయ్యింది. గత ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 లోకి 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. స్టార్ మా సీరియల్స్ టీం vs సోషల్ మీడియా పాపులర్ ఫిగర్స్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన వారిలో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు మొదటి ఎలిమినేషన్ లోకి రాబోతున్నారనే విషయంలో ఉత్సుకత ఏర్పడింది.
నామినేషన్స్ లో ఉన్న వారిలో ముందుగా సోనియా ని సేవ్ చేసారు హోస్ట్ నాగార్జున. తర్వాత సీత, పృథ్వీ, బేబక్క, నాగమణికంఠ, విష్ణు ప్రియా, శేఖర్ భాషాల్లో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆడియన్స్ ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారు, ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయనే విషయంలో కొన్ని పోల్స్ పరిశీలిస్తే.. నాగమణికంఠ సింపతీ గేమ్ వర్కౌట్ అయ్యి ఓటింగ్ లో అతను టాప్ పోజిషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక చివరి వరసలో బేబక్క, పాపులర్ యాంకర్ విష్ణు ప్రియా డేంజర్ జోన్ లో ఉండగా.. అందులో బేబక్క ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ లీకుల ద్వారా బేబక్క ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రక్రియ ఈ రోజు ఆదివారం ఎపిసోడ్ లో చూపించబోతున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన బేబక్క ఆట కన్నా ఎక్కువ కిచెన్ లోనే కనిపించడం ప్రేక్షకులకు నచ్ఛలేదు. దానితో ఆమెను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.