వినాయక చవితి స్పెషల్ గా గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ డేట్ అప్ డేట్ వస్తుంది అని మెగా అభిమానులు చాలా ఆశపడ్డారు. ఈరోజు మెగా ఫ్యాన్స్ గేమ్ చెంజర్ రిలీజ్ అప్ డేట్ ని ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ మేకర్స్ ఎప్పటిలాగే మెగా ఫ్యాన్స్ ని డిజ్ పాయింట్ చేస్తూ గేమ్ ఛేంజర్ నుంచి కోరుకోని అప్ డేట్ ఇచ్చారు.
అది కూడా గేమ్ ఛేంజర్ పాటకు సంబందించిన అప్ డేట్ అది. కేవలం సెప్టెంబర్ లో గేమ్ చెంజర్ సెకండ్ సింగిల్ అన్నారు కానీ అది కూడా డేట్ ఇవ్వలేదు. మెగా ఫ్యాన్స్ కోరుకున్నది ఇదేనా.. అసలు దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయాన్ని తేల్చరా.. డిసెంబర్ 20 న సినిమా విడుదల అని పీలర్స్ వదులుతున్నా ఆ తేదీ పై క్లారిటీ ఇవ్వడం లేదు.
గత వారం రోజులుగా గేమ్ ఛేంజర్ హడావిడి చేసింది ఇందుకేనా అన్నట్టుగా ఈరోజు వినాయక చవితికి వచ్చిన అప్ డేట్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ సెకండ్ సింగిల్ ఆన్ ద వె అనే పోస్టర్ సూపర్, చరణ్ స్టైలిష్ గా అదరగొట్టేసాడు కానీ అనుకున్న అప్ డేట్ అంటే రిలీజ్ డేట్ రాకపోయేసరికి మెగా ఫ్యాన్స్ మాత్రం బాగా నిరాశపడుతున్నారు.