Advertisementt

ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులో జైలర్ విలన్

Sat 07th Sep 2024 08:12 PM
vinayakan  ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులో జైలర్ విలన్
Jailer villain in airport police custody ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులో జైలర్ విలన్
Advertisement
Ads by CJ

 

జైలర్ చిత్రంలో సైకో పాత్ర విలన్ కేరెక్టర్ లో అదరగొట్టిన వినాయకన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కానిస్టేబుల్ ని కొట్టిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తున్న సమయంలో వినాయకన్ దురుసు ప్రవర్తన అతనికి తిప్పలు తెచ్చిపెట్టింది. 

ఎయిర్ పోర్ట్ CISF కానిస్టేబుల్ ని కొట్టడంతో వినాయకన్ ని RGI పోలీసులు అర్రేస్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ఏడాది కూడా వినాయకన్ దురుసు ప్రవర్తతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కానిస్టేబుల్ ని కొట్టిన ఘటనలో వినాయకన్ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

వినాయకన్ కొచ్చి నుంచి వచ్చి గోవా వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తున్న సమయంలో మద్యం మత్తులో కానిస్టేబుల్ పై చెయ్యి చేసుకోవడంతో RGI పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

Jailer villain in airport police custody:

Actor Vinayakan detained after alleged assault by CISF Constable

Tags:   VINAYAKAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ