ఆగష్టు 15 బరిలో క్రేజీ సినిమాలతో పోటీ పడిన చిన్న సినిమా ఆయ్ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద హిట్టు కట్టబెట్టారు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో పాటుగా, విక్రమ్ తంగలాన్ డబ్బింగ్ చిత్రంతో పోటీకి సై అన్న ఆయ్ చిత్రం పై చాలామంది జాలి పడిపోయారు. ఆయ్ చిన్న సినిమా ఈ క్రేజీ సినిమాల నడుమ నలిగిపోతుంది అని.
కానీ ఆయ్ చిన్న సినిమానే కానీ.. కంటెంట్ బలంగా ఉండడంతో థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్స్ లో మంచి హిట్ గా నిలిచి నిర్మాతలకు భారి లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్ర ఓటీటీ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
ఆగష్టు 15 న థియేటర్స్ లో విడుదలైన ఆయ్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆయ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవడమే కాదు.. పోస్టర్ తో అనౌన్సమెంట్ ఇచ్చేసారు.