రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ ఆగష్టు 15 న భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలవగా.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఆ సినిమా అందుకోవడంలో విఫలమయ్యింది. హరీష్ శంకర్ ఓవర్ కాన్ఫిడెంట్, రవితేజ నమ్మకం అన్ని వమ్మయ్యాయి. మిస్టర్ బచ్చన్ తో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
దానితో రవితేజ, హరీష్ శంకర్ లు తమ తమ పారితోషికాల్లో కొంత అమౌంట్ ను నిర్మాతలకు తిరిగి ఇచ్చేసారు. అదలా ఉంటే ఆగష్టు 15 న థియేటర్స్ లో విడుదలైన మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ ఉంటుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్, రవితేజ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ఓటీటీ డేట్ వచ్చేసింది.
మిస్టర్ బచ్చన్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతుంది. మరి ఈ మిస్టర్ బచ్చన్ థియేటర్స్ లో విడుదలైన నెల లోపులోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుందన్నమాట.