కొరటాల శివ ఇప్పటివరకు దేవర ప్రమోషన్స్ విషయంలో చాలా లైట్ గా ఉండడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అసహనం, ఆందోళన తొణికిసలాడింది. సెప్టెంబర్ 10 దేవర ట్రైలర్ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినాయక చవితి సందర్భంగా ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.
అయితే దేవర ప్రమోషన్స్ ను ఆ సెప్టెంబర్ 10 ట్రైలర్ తోనే స్టార్ట్ చేయబోతుంది టీమ్ . దేవర ట్రైలర్ ను ముంబై వేదికగా లాంచ్ చేసేందుకు బిగ్ ప్లాన్ రెడీ అవుతుంది. అక్కడ ముంబై లో ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ ఇంకా కీలక టెక్నీషియన్స్ నడుమ కరణ్ జోహార్ హోస్ట్ గా దేవర ట్రైలర్ లాంచ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ దేవర నార్త్ రైట్స్ కొనుగోలు చేసి బాలీవుడ్ లో విడుదలచెయ్యబోతుంది. సో అలా కరణ్ దేవర ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు. దేవర ట్రైలర్ నుంచే ప్రమోషన్స్ ప్రకంపనలు కూడా మొదలు కాబోతున్నాయి.