సౌత్ లో ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ కు క్రమేణా ఆదరణ తగ్గుతూ వస్తుంది. గత కొని సీజన్స్ కి బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. బిగ్ బాస్ టిఆర్పీ తగ్గిపోతుంది. నాగార్జున ఎంత మాయ చేసినా బుల్లితెర ఆడియన్స్ ఇంప్రెస్స్ అవ్వట్లేదు. కొత్త కొత్తగా గేమ్ పెట్టినా ఇంట్రెస్ట్ కలగడం లేదు.
ఇక కొత్తగా మొదలైన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ చూస్తే ఇది బిగ్ బాస్ నా లేదంటే స్టార్ మా సీరియల్ నా అంటారు. ఈ సీజన్ లో అంతా స్టార్ మా సీరియల్స్ వారే కనిపిస్తున్నారు. బిగ్ బాస్ లో కనిపించేవారిలో ఎక్కువగా కన్నడ బ్యాచ్. స్టార్ మా లో కృష్ణ ముకుంద మురారి నటులు ప్రేరణ, యష్మి లు, ఇంకా నిఖిల్, సిద్దు ఇలా కొంతమంది సీరియల్ నటులు ఉన్నారు.
వారిని చూసినప్పుడల్లా ఇది బిగ్ బాస్ హౌస్ లా లేదు.. స్టార్ మా లో సీరియల్స్ చూస్తున్నట్టుగా ఉంది అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లోను ఆ మొహాలే, బిగ్ బాస్ లోను ఆ మొహాలేనా అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.