దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకా 20 రోజుల సమయమే ఉంది. కానీ ఇప్పటివరకు కొరటాల శివ ప్రోపర్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దేవర సాంగ్ విడుదలైంది, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది ఓకె. కానీ కొరటాల శివ తన టీం తో కలిసి ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ అనేది ప్లాన్ చేయకుండా ఇంకా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ తోనే కూర్చోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.
ఇండియాలోని ప్రధాన నగరాల్లో దేవర సినిమాని ప్రమోట్ చెయ్యాలి. ఇప్పటివరకు నార్త్ లో దేవర పై ఉన్న హైప్ ఎంత అనేది క్లారిటీ లేదు, అసలు దేవర అప్ డేట్స్ ఎంతమేరకు నార్త్ ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి. దేవర పై నార్త్ మీడియా ఎంతవరకు ఫోకస్ చేసింది అనేది స్పష్టత లేదు, అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ముంబై నుంచి హడావిడి మొదలు పెట్టాలి.
కానీ కొరటాల శివ ప్లానింగ్ ఎలా ఉంది. సినిమా ఈ నెల 27 కి విడుదల. ఈ 20 రోజుల్లో ఎంతెలా సినిమాని ప్రమోట్ చేస్తారు. సినిమా ని ఎంతగా ప్రేక్షకుల్లోకి తెలుసుకెళ్ళాలి, అసలే ఆచార్య ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి, దేవర కు మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే దేవర ప్రమోషన్స్ ని డిఫ్రెంట్ గా చెయ్యాలి.
తాజాగా దేవర ట్రైలర్ ఈ నెల 10 అంటే మంగళవారం విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. అది యూట్యూబ్ లోనా లేదంటే ఈవెంట్స్ ఎమన్నా ప్లాన్ చేసారా అనేది తెలియాలి
ఇంతవరకు కొరటాల సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఎన్టీఆర్ దేవర విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు. అదే అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం. కొరటాల గారు త్వరగా మేలుకోండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.