కన్నడ బ్యూటీ శ్రీలీల తెలుగులోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన కెరటం. పెళ్లి సందD, ధమాకా తర్వాత ఈ బ్యూటీకి ఎదురు లేకుండా పోయింది. వరస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. యంగ్ హీరోలు పిలిచి అవకాశం ఇచ్చేసరికి పాత్ర అంచనా వెయ్యడంలో తడబడింది. ఫలితం వరసగా నిరాశపరిచే సినిమాలు ఆమెని ఇబ్బంది పెట్టాయి.
గుంటూరు కారం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళి కాస్త బిజీ అయిన శ్రీలీల కొద్దిరోజుల క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫర్ కాదంది అంటూ శ్రీలీల ను తెగ ట్రోల్ చేసారు. విజయ్-వెంకట్ ప్రభు కలయికలో తెరకెక్కిన GOAT చిత్రంలో శ్రీలీల కు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది.
కానీ శ్రీలీల ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది అన్నారు. కానీ ఇప్పుడు GOAT రిలీజ్ అయ్యాక శ్రీలీల కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అంటున్నారు. అప్పట్లో యంగ్ హీరోల సరసన నటిస్తోన్న సమయంలో ఐటం సాంగ్‌లో నటించడం సరైంది కాదని శ్రీలీల కు కొందరు ఇచ్చిన సూచనలతో విజయ్ సాంగ్‌ను రిజెక్ట్ చేసిందట.
శ్రీలీల కాదనడంతో ఆ సాంగ్ లో త్రిష నటించింది. సినిమాలో త్రిష, విజయ్ సాంగ్ చూసాక.. శ్రీలీల ఈ పాటను చేయకపోవటమే బెస్ట్ అంటున్నారు. విజువల్‌గా ఈ సాంగ్ అంత వరస్ట్‌గా ఉందని ఆడియన్స్ మాట్లాడుకోవడం చూసి శ్రీలీల డెసిషన్ కరెక్ట్ అంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.