Advertisementt

బిగ్ బాస్ 8 లోకి మాజీ కంటెస్టెంట్స్

Fri 06th Sep 2024 12:45 PM
bigg boss 8  బిగ్ బాస్ 8 లోకి మాజీ కంటెస్టెంట్స్
Ex-contestants of Bigg Boss 8 బిగ్ బాస్ 8 లోకి మాజీ కంటెస్టెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 మొదలై రేపు ఆదివారానికి ఖచ్చితంగా వారం పూర్తవుతుంది. మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు నాగార్జున. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కానీ.. ఆ ఎలిమినేట్ అయ్యే వారి ప్లేస్ లోకి ఓ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది అని వినికిడి. 

మొదటి రోజు 14 మంది హౌస్ లోకి వెళితే.. తర్వాత నాలుగు వారాల పాటు నలుగురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తారని తెలిసిన విషయమే. అయితే ఈ నలుగురు ఇప్పుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీజన్ 8 లోకి అడుగుపెడతారని అంటున్నారు. అందులో ముఖ్యంగా గత సీజన్ లో నోరేసుకుని పడిపోయిన శోభా శెట్టి ఈవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ వుంది అంటున్నారు. 

వచ్చే వారం మరో మాజీ కంటెస్టెంట్స్ అయిన యాంకర్ రవి ని హౌస్ లోకి పంపించే ఆలోచనలో యాజమాన్యం ఉంది అంటున్నారు. ఆ తర్వాత మరో మాజీ గీతూ రాయల్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది రెండు వారాల్లో తేలిపోతుంది. అన్నారు ప్రస్తుతం హౌస్ మొత్తం చేపల మర్కెట్ మాదిరి కంటెస్టెంట్స్ కొట్లాటకు దిగుతున్నారు. కారణం త్వరగా హైలెట్ అవ్వాలని వారి ప్లాన్.  

Ex-contestants of Bigg Boss 8:

Sobha Shetty, Anchor Ravi and Geethu Royal enter Bigg Boss 8?

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ