సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు విన్నా, కనిపించినా వైసీపీలో 100కు 80 శాతం మందికి ఒళ్ళంతా కంపరం..! ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సఖల శాఖ మంత్రిగా.. ఆఖరికి షాడో సీఎంగా ఉండి పార్టీని సర్వనాశనం చేశారన్నది ఆ పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం..! ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలే మీడియా ముందుకు వచ్చి సజ్జలే పార్టీని సర్వనాశనం చేశారని, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఐతే నిత్యం సజ్జలపై కార్యకర్తలు అసంతృప్తి రగిలిస్తూనే.. ఆయన్ను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ఎందుకిలా..?
పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి సజ్జలపై ఆరోపణలు చేయడమే కాదు ఆధారాలతో సహా చూపడంతో జగన్ బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకున్నారని తెలిసింది..! ఇక పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది..! ఒకవేళ ఉన్నా ఆయనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎలాగంటే.. ఒకవైపు పార్టీకి రాజీనామాలు కంటిన్యూ అవుతుంటే మరోవైపు ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు, జిల్లాలకు ఇంచార్జీలను, పార్టీ లీగల్ వ్యవహారాలు చూస్కోవడానికి సలహాదారులు.. వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించడం జరిగింది. ఐతే ఇప్పటివరకూ కీలకమైన అన్నిటికీ నియామకాలు జరిపిన వైసీపీ.. సజ్జలను మాత్రం పట్టించుకోలేదు.. దీంతో.. పార్టీకి పట్టిన దరిద్రం పోయింది బాబోయ్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హమ్మయ్యా.. అబ్బ సాయిరాం.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు.
నిజమేనా..?
వాస్తవానికి.. వైఎస్ ఫ్యామిలీతో సజ్జలకు ఉన్న అనుబంధం గురుంచి పలు సందర్భాల్లో మనం Cinejosh.Com లో విశ్లేషణాత్మక కథనాలు చాలానే రాశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి.. నేటి వరకూ, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఫ్యామిలీకి, పార్టీ, వ్యాపారాలకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. ఐతే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక లేనిపోని.. అస్సలు అవసరంలేని విజయాల్లో వెళ్ళు.. కళ్ళు.. మనిషి మొత్తం దూరి పార్టీని సర్వ నాశనం చేశారనే ఆరోపణలు తప్ప మిగిలిన విషయాల్లో ఆయన ఫుల్ పర్ఫెక్ట్..! అని సొంత పార్టీలోని మరికొందరు చెబుతున్న మాటలు. అలాంటిది.. సజ్జలను జగన్ వదులుకున్నారంటే అస్సలు నమ్మే మాటేనా..? ఇది జరిగే పనేనా..? అంటే అస్సలు కానే కాదు. బహుశా.. ఇప్పటి వరకూ ప్రకటించిన జాబితాల్లో పేరు లేకపోవచ్చు కానీ సజ్జలకు ఉండే ప్రియారిటి ఎప్పటికీ ఉంటుంది.. ఏ మాత్రం తగ్గదు అంతే.. అంటూ ఆయన అంటే అభిమానించే వారు కొందరు చెబుతున్నారు. రానున్న రోజుల్లో సజ్జలకు అధినేత ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి మరి.