Advertisementt

విజయ్ GOAT ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్

Fri 06th Sep 2024 10:07 AM
vijay  విజయ్ GOAT ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్
Vijay GOAT OTT Partner Revealed విజయ్ GOAT ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా GOAT చిత్రం నిన్న గురువారం థియేటర్స్ లో విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అదే విషయాన్ని టైటిల్ కార్డ్స్ లోనే మేకర్స్ అనౌన్స్ చేసారు. 

ఈ చిత్రాన్ని థియేటర్లలోకి విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Vijay GOAT OTT Partner Revealed:

Thalapathy Vijay GOAT to stream on THIS OTT platform

Tags:   VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ