సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆ.. ఈ పేరు గత 24 గంటలుగా ఎక్కడ చూసినా మారుమోగింది..! అబ్బో.. ఈయన తాలూకు వీడియోలు అంటారా అబ్బో ఇక వాటి గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే..! ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితి నెలకొంది. ఇదిగో ఇతను మీ వాడే మీ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడని వైసీపీని ఉద్దేశించి టీడీపీ తిట్టిపోస్తుంటే.. అబ్బా పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇన్నాళ్లు తెలియలేదా..? ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఇలా ఆరోపించడం ఎంత వరకూ సమంజసం అంటూ వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేస్తోంది.
సస్పెండ్ అంతే కదా..!
వైసీపీ హయాంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల రాసలీలలు బయటపడినా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే.. అలా కంప్లయింట్ వచ్చిందో లేదో వెంటనే టీడీపీ ఎమ్మెల్యేని అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెబుతున్నారు. ఐతే.. సస్పెండ్ చేస్తే ఏంటి ఉపయోగం..? ఆయన ఇంకా టీడీపీ ఎమ్మెల్యేనే కదా..? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇంకా ఆదిమూలం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉంటే సస్పెండ్ చేస్తే ఏంటీ చెయ్యకపోతే ఏంటీ..? అని ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయ్. ఆదిమూలం రాజీనామా చేసి.. మళ్ళీ ప్రజల తీర్పు కోరాలి.. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు తను ఎమ్మెల్యేగా కొనసాగాలా..? వద్దా..? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సస్పెండ్ కాదు చంద్రబాబు ఆ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించండి..? అనే డిమాండ్ గట్టిగానే వస్తోంది.
వైసీపీ ఏం తక్కువేం కాదులే!
ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఒకరా ఇద్దరా లెక్కలేనంత మంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గోరంట్ల మాధవ్ నుంచి నిన్న మొన్నటి సిట్టింగ్ ఎంపీ వరకూ చాలా మందే ఉన్నారు. ఐతే.. దీనికి మాత్రం నాటి నుంచి నేటి వరకూ వైసీపీ వాళ్లు హనీట్రాప్ వల్లే దొరికారని.. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా కార్యకర్తను వేధించడం, లాడ్జీకి తీసుకెళ్ళి మరీ బలవంత పెట్టారని ఇందుకు సంబంధించి వీడియోలు కూడా అడ్డంగా దొరికితినే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఐతే.. వైసీపీ నాయకుల విషయంలో ఒక్క మహిళ కూడా కంప్లైంట్ ఇవ్వలేదనే విషయాన్ని సైతం గుర్తు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. అప్పట్లో వైసీపీ కూడా ఇప్పుడు చంద్రబాబు చేసినట్లుగానే సస్పెండ్ చేసి ఉన్నా బాగుండేది.. ఓటమిలో ఇది కూడా ఒక కారణం అని సొంత పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. మరి.. రేపు పొద్దున్న ఆదిమూలం రాజీనామా చేస్తారా..? లేదా పార్టీనే చేపిస్తుందా..? ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటి..? అనేది చూడాలి మరి.