బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇంకా వారం రోజులు కాలేదు. అప్పుడే అందులోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అంతా చాలా సీరియస్ గా గేమ్ మొదలు పెట్టేసారు. బుల్లితెర ఆడియన్స్ అటెన్షన్ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. స్టార్ మా సీరియల్స్ బ్యాచ్ vs సోషల్ మీడియా బ్యాచ్ అన్నట్టుగా ఈ సీజన్ కనిపిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నాగమణికంఠ అయితే బిగ్ బాస్ లో సింపతీ గేమ్ కి తెర లేపాడు. తనని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ లోకి నెట్టడంతో నాగమణికంఠ కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. స్టెప్ ఫాదర్ తో అగచాట్లు పడ్డాను, భార్య వదిలేసింది. అత్తమామల నుంచి రెస్పెక్ట్ లేదు, తన పాప కోసమే తాను బిగ్ బాస్ లోకి వచ్చా అంటూ ఏడిపించేసాడు.
అతను డే 1 నుంచే దానినే ఎక్స్పోజ్ చేస్తూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నాడని అతని తోటి హౌస్ మేట్స్ ఆరోపిస్తున్నారు. గత రాత్రి నామినేషన్స్ ప్రక్రియలో నాగమణికంఠ ఏడుస్తూ బిగ్ బాస్ కి గోడు వెళ్లబోసుకున్నారు. దానితో బిగ్ బాస్ అతన్ని ఓదార్చిన ఎపిసోడ్ చూసిన వారంతా బాబోయ్ సీజన్ 8 లో సింపతీ గేమ్ స్టార్ట్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.