Advertisementt

మెగా ఫ్యాన్స్ ఎంతకు తెగించారు!!

Thu 05th Sep 2024 05:58 PM
mega fans  మెగా ఫ్యాన్స్ ఎంతకు తెగించారు!!
Mega fans negative trend on Game Changer మెగా ఫ్యాన్స్ ఎంతకు తెగించారు!!
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా అసహనంతో కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా గేమ్ ఛేంజర్ విడుదల డేట్ పై వస్తోన్న వార్తలు మెగా ఫ్యాన్స్ ని కూల్ చేసినా ఒక్కోసారి వారి సహనం హద్దులు దాటుతుంది. డిసెంబర్ 20, 2024 గేమ్ ఛేంజర్ విడుదల అన్నప్పటికీ అందుకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వకుండా ఇంకా మేకర్స్ ఆలోచనలోనే ఉన్నారు. వినాయక చవితికి ఆ అప్ డేట్ రాబోతుంది. 

అయితే పోస్టర్ తో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తారని అంటున్నప్పటికి అది మెగా ఫ్యాన్స్ కి సరిపోదట. ఏదో ఒక వీడియో కావాలని, అది టీజర్ అయితే బావుంటుంది అని మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ మేకర్స్ పై ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టడమే కాదు.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్స్ స్టార్ట్ చేసారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ఇలా గేమ్ ఛేంజర్ తో కనెక్ట్ అయిన వారిని ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ అసభ్యకర ట్వీట్స్ తో నెగెటివ్ ట్రెండ్ మొదలు పెట్టారు. 

గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. అందుకే గేమ్ ఛేంజర్ టీం పై మెగా ఫ్యాన్స్ ఎంతకు తెగించారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగెటివ్ ట్రెండ్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రెస్పాండ్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. నెగెటివ్ ట్రెండ్స్ లేదా అసభ్యకరమైన వ్యాఖ్యలను వ్యాప్తి చేయడం వల్ల ఉపయోగం ఏమిటి. 

ఇది గేమ్ చెంజర్ పై ఉన్న క్రేజ్ ను నాశనం చేస్తుంది. ఆ సినిమా గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది. మా కష్టాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు సరైన పద్దతి ని ఫాలో అవుతున్నాము. ఫ్యాన్స్ అంతా దయతో మాకు కొంత శక్తిని అందించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.. అంటూ  థమన్ మెగా ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

Mega fans negative trend on Game Changer:

Thaman responds to negative trend planned by fans

Tags:   MEGA FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ