గత నాలుగు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు నేరుగా సహాయం అందేలా చూస్తూ కష్టపడుతున్నారు. బుడమేరు నదికి గండ్లు పడడంతో విజయవాడను వరద నీరు ముంచేత్తింది. ప్రస్తుతం బుడమేరు గండ్లు పూడికలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. అందులో భాగంగా చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మధురా నగర్ రైల్వే ట్రాక్ పై ఎక్కారు.
అదే సమయంలో అటు వైపుగా ట్రెయిన్ రావడంతో, అక్కడి నుంచి వెళ్దామని చంద్రబాబు కు చెప్పిన భద్రతా సిబ్బంది చెప్పిన వెంటనే చంద్రధండు కార్యకర్తలు లైన్ మ్యాన్ ను తీసుకువచ్చి ఎర్రజెండా వూపడంతో ట్రెయిన్ స్లో అవడంతో చంద్రబాబు కు తృటిలో తప్పిన ముప్పు.
బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కిన ముఖ్యమంత్రి, ట్రెయిన్ కు మూడు అడుగుల దూరంలో ఉన్న సీఎం చంద్రబాబు, ట్రైన్ చంద్రబాబు కు మూడు అడుగుల దూరంలో ఆగడంతో వూపిరి పీల్చుకున్న భద్రత సిబ్బంది.