నందమూరి వారసుడు తెరంగేట్రానికి రంగం సిద్దమైపోయింది. సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కాకపోయినా.. రేపు మోక్షజ్ఞ బర్త్ డే రోజున ఆయన మొదటి సినిమాకు సంబందించిన అనౌన్సమెంట్ కు ముహూర్తం పెట్టేసారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు.
రేపు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10.36 నిమిషాలకు PVCU 2 అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా లో ట్వీట్ చేసాడు. ఇది మోక్షజ్ఞ మూవీ గురించే అని అందరూ ముఖ్యంగా నందమూరి అభిమానులు అలెర్ట్ అవుతున్నారు. ముందుగా మోక్షు బర్త్ డే కి సినిమాను అనౌన్స్ చేసి ఆ తర్వాత రెండుమూడు నెలల్లో సినిమాను పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్సమెంట్ రాబోతుంది. మరి ఇది నందమూరి అభిమానులకు పండగే కదా.