Advertisementt

కార్యకర్తతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు!

Thu 05th Sep 2024 03:08 PM
mla koneti adimulam  కార్యకర్తతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు!
TDP MLA, Suspended On Spot కార్యకర్తతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు!
Advertisement
Ads by CJ

అవును.. టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి స్వయానా బాధితురాలు మీడియా మీట్ పెట్టి మరీ పెన్ కెమెరాలో చిత్రీకరించిన వీడియోలు.. వాట్సాప్ కాల్స్, చాటింగ్ మొత్తం బయటపెట్టింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, టీడీపీ మహిళా కార్యకర్తతో ఓ హోటల్‌లో జరిపిన రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు, హైకమాండ్ ఒక్కసారిగా కంగుతిన్నది. బాధితురాలు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా మీట్ పెట్టి మరీ ఇందుకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

ఇంతకీ ఏం జరిగింది..?

సదరు మహిళ కూడా టీడీపీ కార్యకర్తే. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో ఆయన ఎమ్మెల్యేగా.. ఆమె కార్యకర్తగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా పరిచయమైన ఆదిమూలం ఫోన్ నంబర్ తీసుకొని వీడియో కాల్స్ చేయడం, ఇష్టానుసారం వాట్సాప్ చాటింగ్ చేస్తూ చిత్రహింసలు పెట్టేవారని బాధితురాలు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఒకసారి.. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో నుంచి రూమ్ నెంబర్ 109 లోకి రమ్మని చెప్పడంతో వెళ్లిన తనను.. బెదిరించి ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. ఎవరికైనా చెబితే నాతో, పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.

అలా నా పై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని మహిళ, ఆమె భర్త మీడియాకు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.

ఎలా బయటికొచ్చింది..?

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో ఉండొద్దని.. సస్పెండ్ చేయాలని మహిళ డిమాండ్ చేస్తోంది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని.. సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేసిన విషయాన్ని కాల్ రికార్డ్స్ బయటపెట్టి మరీ చెప్పింది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని.. రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడంటూ బాంబ్ పేల్చింది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తను పక్కలోకి రావాల్సిందేనని సత్యవేడు ఎమ్మెల్యే ఎంతో మందిని టార్చర్ చేశాడని.. తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్‌కు ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని అంతా బయటపెట్టేసింది ఆ మహిళ.

వద్దు.. ఇలాంటోడు!

ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళ డిమాండ్ చేస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యేను ఎలాంటి కార్యక్రమాలకు పిలవొద్దని పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే.. ఇంటికి వచ్చాడని సంబరపడి పోవద్దని.. ఇంటికి వస్తే మీ భార్య, మీ పిల్లలపై కన్నేస్తాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆది మూలం కామాంధుడు, రాక్షసుడు అని.. ఇతని నుండి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆదిమూలం స్పందిస్తూ.. నేనేంటో నా పనితనం ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు నాపై కుట్ర చేశారు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియో చూస్తే మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని కోనేటి ఆదిమూలం చెప్పుకొచ్చారు. వైసీపీకి ఏ మాత్రం తక్కువ కాదని టీడీపీ ఎమ్మెల్యేలు నిరూపిస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే తిట్టిపోస్తున్న పరిస్థితి.

వాట్ నెక్స్ట్..!

ఇదిలా ఉంటే.. ఆదిమూలం వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. మీడియా, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలు విషయం సీఎం నారా చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు, అధికారులు తీసుకెళ్లగా.. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే.. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో బాబు బిజిబిజీగా ఉండటంతో.. కాస్త ఫ్రీ అయ్యాక నివేదిక తీసుకుని ఆ తర్వాత చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కఠిన చర్యలు ఏంటి..? ఎమ్మెల్యేను సీఎం ఏం చేయబోతున్నారు..? అనే విషయాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి.

TDP MLA, Suspended On Spot:

TDP Suspends Satyavedu MLA Koneti Adimulam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ