ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ అనగానే అందరిలో ఎన్నో అంచనాలు, లైగర్ డిసాస్టర్ ని, రామ్ రెడ్, స్కంద చిత్రాల డిసాస్టర్స్ ని పట్టించుకోకుండా ఆ కాంబో పై అంచనాలు ఏర్పడ్డాయి. అందులోను ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనగానే అదే బ్లాక్ బస్టర్ ని ఊహించేసుకుని ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో పూరి-రామ్ సక్సెస్ అయ్యారు.
ఆగష్టు 15 న భారీ అంచనాలు నడుమ మిస్టర్ బచ్చన్ తో పోటీ పడిన డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. లైగర్ గాయాన్ని మానుపుతుంది, డబుల్ ఇస్మార్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు, రామ్ కు ఇద్దరికి కంబ్యాక్ మూవీ అవుతుందనుకుంటే లైగర్ గాయాన్ని మరింత పెద్దది చేసింది.
ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కి నాలుగు వారాల గడువుతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని మేకర్స్ అమ్మగా.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా 21 రోజులకు అమెజాన్ ప్రైమ్ లో చడీ చప్పుడు లేకుండా స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. ఓటీటీ డేట్ పై ముందస్తు ఎనౌన్సమెంట్ ఇవ్వలేదు.
అమెజాన్ ప్రైమ్ ఎలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీ వాడలేదు. కామ్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి తేవడంతో తెల్లవారాక దీనిని చూసిన ఓటీటీ ఆడియన్స్ షాక్ తిన్నారు.