దేవర బ్యూటీ గా మారక ముందే బాలీవుడ్ చిన్నది శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో గ్లామర్ గర్ల్ గా అందరికి సుపరిచితురాలు. బాలీవుడ్ సినిమాల్లో పెరఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కేరెక్టర్స్ లో కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నంతగా ఆమె అందాలు ఆరబోసేస్తుంది.
ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ తో యూత్ ని కవ్వించే జాన్వీ కపూర్ ని కొరటాల కూడా గ్లామర్ డాల్ గానే సౌత్ ప్రేక్షకులకు పరిచయం చెయ్యబోతున్నాడు. దేవర లో తంగం కేరెక్టర్ లో సాదా సీదాగా కనిపిస్తున్న జాన్వీ కపూర్ దేవర సాంగ్స్ లో మాత్రం అదిరిపోయే అందాల అందరబోతలో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. తాజాగా ఓ పిక్ షేర్ చేసింది.
బ్లాక్ కలర్ షైనింగ్ డ్రెస్ వేసుకున్న జాన్వీ కపూర్ బెడ్ పై కనిపించిన తీరు చూస్తే జాన్వీ నువ్వు చాలా హటమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. హెయిర్ వదిలేసి తన లుక్స్ తో ఫ్లాట్ చేసేసింది. తన వయ్యారంతో నిజంగా మైండ్ బ్లాక్ చేసేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ట్రెండీ లుక్ సంచలనంగా మారింది.