టైటిల్ చూస్తే విచిత్రంగా లేదూ..! అన్ని తెలిసి సీఎం అయిన వ్యక్తిని ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో బంధించడం ఎవరికి సాధ్యం. ఎంతగా కోటరీ కట్టినా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తికి కనీస ఇంగితం ఉండదా.. తనని సీఎం ని చేసిన ప్రజలకు సాయం చెయ్యాలనే జ్ఞానం ఉండదా.. ఒకరు చెబితే మాత్రం ప్యాలెస్ లో నిద్రపోతాడా ఇప్పుడు ఇదే ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు.
ఏపీలో ప్రస్తుతం వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. విజయవాడ నగరాన్ని బుడమేరు, కృష్ణమ్మ వరదలు అతలాకుతలం చేసాయి, సీఎం అంతటి వాడే పగలనక, రాత్రనక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇక తాను ఇంట్లో కూర్చుంటే బాగుండదని మాజీ సీఎం జగన్ కూడా కదలక తప్పలేదు. గత ఐదేళ్ళలో ప్రజా సమస్యలను పట్టించుకొని జగన్ ఇప్పుడు ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిసున్నాడు.
అది చూసిన బ్లూ మీడియా గత ఐదేళ్లుగా జగన్ ను ప్రజలను కలవకుండా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వైసీపీ నేతలు, మంత్రులు, సన్నిహితులు ప్యాలెస్ లోనే బంధించారు, కానీ ఇప్పుడు ఆ సంకెళ్లు తెంచుకుని ప్రజల్లోకి వస్తున్న జగన్ ని చూసి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటూ పొగడడం హాస్యాస్పదం అంటూ నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని నాయకుడికి ఇప్పుడు అధికారం పోగానే ప్రజలు గుర్తొచ్చారంటూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.