ఈమధ్యన మాస్ మహారాజ్ రవితేజ సినిమాలపై విమర్శలు ఎక్కువైపోతున్నాయి. అసలు రవితేజ కథలు వింటున్నాడా, కథను జెడ్జ్ చెయ్యడంలో లెక్క తప్పుతున్నాడా, లేదంటే దర్శకుల స్టామినాని అంచనా వెయ్యలేకపోతున్నాడా అనే విషయంలో రవితేజ పై విమర్శలు ఎక్కువయ్యాయి. మరోపక్క పారితోషికం ఉంటే చాలు ఎలాంటి సినిమా అయినా చేసేస్తాను అనేలా రవితేజ సినిమాలున్నాయనే మాట కూడా బాగానే వినబడుతుంది.
క్రాక్ సినిమా కు ముందు వరస సినిమాలు ప్లాప్ లు, క్రాక్ విడుదలయ్యాక ధమాక వరకూ మధ్యలో ఖిలాడీ, రామా రావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరావు నిరాశ పరచగా ఆ తర్వాత ధమాకా హిట్ అయ్యింది. మళ్ళీ ఈగల్, మిస్టర్ బచ్చన్ తో రవితేజ నిరాశపరిచాడు. అయితే పారితోషికం విషయంలో రవితేజ పై చాలా విమర్శలున్నాయి. రూపాయి కూడా తగ్గడట.
తాజాగా రవితేజతో మార్పువచ్చినట్టుగా కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ తర్వాత RT 75 సెట్స్ లోకి వెళ్ళిపోయిన రవితేజ ఆ సినిమా సెట్స్ లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. అయితే రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ వలన నిర్మాతలు భారీగా నష్టపోయారు. దానితో దర్శకుడు హరీష్ శంకర్ తన పారితోషికం నుంచి 2 కోట్లు వెనక్కి ఇచ్చేసి ఇంకా నాలుగు కోట్లు తన తదుపరి మూవీలో కట్ చేసుకోమని మిస్టర్ బచ్చన్ నిర్మాతలకు చెప్పినట్లుగా తెలుస్తుంది.
అప్పుడు రవితేజ కూడా ఇలా చేస్తే బావుంటుంది అన్నారు. అలా అనుకున్న కొద్దిగంటల్లోనే రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ నిర్మాతలకు నాలుగు కోట్లు పారితోషికం తిరిగి ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. అది విన్న చాలామంది ఎన్నాళ్లకెన్నాళ్లకు రవితేజ లో మార్పు అంటూ కామెంట్ చేస్తున్నారు.