సమంత కొద్దిరోజులుగా షూటింగ్ సెట్స్ లో కనిపించడమే లేదు. గత ఏడాది సిటాడెల్ వెబ్ సీరీస్, ఖుషి చిత్రాల తర్వాత ఆమె స్పెషల్ ఫోటో షూట్స్ తప్ప ఏ సినిమా షూటింగ్ కానీ, లేదంటే వెబ్ సీరీస్ షూటింగ్ కానీ చెయ్యలేదు. హెల్త్ ఇష్యుస్ తో ఇబ్బంది పడిన సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటూనే మధ్య మధ్యలో గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ హడావిడి చేస్తుంది.
ప్రస్తుతం నిర్మాతగా, అలాగే ఓ వెబ్ సీరీస్, ఓ సినిమా కి సైన్ చేసిన సమంత ఇంకా షూటింగ్ చేస్తున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పడు షూటింగ్ సెట్స్ లో సమంత గాయపడిన విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాను యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నప్పుడు మోకాలికి గాయమవగా దానికి ఆమె సూదులు గుచ్చుకుని వైద్యం చేయించుకుంటున్న పిక్ ని షేర్ చేసింది.
ఆ పిక్ తో పాటుగా గాయాల పాలవకుండా నేను యాక్షన్ స్టార్ట్ ని అవ్వగలనా అంటూ ఇన్స్టా లో రాసుకొచ్చింది. మరి సమంత ఏ షూటింగ్ సెట్స్ లో గాయపడిందో అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు.