నగరి మాజీ ఎమ్యెల్యే రోజా పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంట్లో కూర్చుని కబుర్లు చెబుతూ అధికార పార్టీని విమర్శించడం కాదు.. నీకు చేతనైతే చేయూత అందించు, సహాయం చెయ్యి అంతేకాని పని చేసుకునే వాళ్లపై విమర్శలు చెయ్యడం అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ నెటిజెన్స్ రోజా పై ఫైర్ అవుతున్నారు.
ఏపీలో విజయవాడ మొత్తం బుడమేరు వాగు ఉప్పొంగడంతో జలమయమైంది. అటు కృష్ణ నది, ఇటు బుడమేరు వాగులు విజయవాడ ప్రాంత ప్రజలను వరదల్లో ముంచెత్తాయి. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి అక్కడి ప్రజలకు సహాయచర్యలు చేపట్టారు. మరోపక్క వైసీపీ నేతలు చంద్రబాబు పై మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
నగరి వైసీపీ మాజీ ఎంఎల్యే రోజా ఏపీ మొత్తం వరదల్లో కొట్టుకుపోతుంటే మంత్రులు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రజలంతా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం మత్తులో ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై ప్రజలు, నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.
నీవు గత ఐదేళ్లుగా ఎంత మాత్రం ప్రజలకు మంచి చేసావో అందరూ చూసారు. అందుకే ఇంట్లో ఉన్నావు. నీకు మానవత్వం ఉంటే ఒకరిని విమర్శించడం కాదు నీకు చేతనైనంత సహాయం చెయ్యి, అప్పుడు మాట్లాడు అంటూ అటు పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా రోజాకి ఇచ్చి పడేసారు.