మహేష్ బాబు ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు. రాజమౌళి సినిమా ఆలస్యం కావడంతో మహేష్ తన ఫ్యామిలీతో సహా యుఎస్ ట్రిప్ వేశారు. భార్య నమ్రత, గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి మహేష్ న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రీసెంట్ గానే గౌతమ్ బర్త్ డే ని యుఎస్ లో సెలెబ్రేట్ చేసింది మహేష్ జంట. మహేష్ రాజమౌళి తో చెయ్యబోయే SSMB 29 కోసం మేకోవర్ అవుతున్నారు.
ఇప్పటికే లాంగ్ హెయిర్ తో పెరిగిన గెడ్డంతో మహేష్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఎంతగా క్యాప్ పెట్టి కవర్ చేసినా మహేష్ హెయిర్ మాత్రం చాలా చోట్ల రివీల్ ఆవుతూనే ఉంది. తాజాగా భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి యుఎస్ లో మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.
తాజాగా భర్త మహేష్ తో కలిసి న్యూయార్క్ వీధుల్లో ఫోటోలకు ఫోజులిచ్చిన నమ్రత ఆ పిక్స్ తో పాటుగా.. Somewhere between living and dreaming, there’s New York 🇺🇸 అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ నెట్టింట సంచలనంగా మారాయి.