ఈవయసులో ప్రజల్లోకి వెళ్లి వరద నీటిలో అంతలా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు గారిని చేతనైతే అభినందించండి అంతేకాని విమర్శించకండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను కోరుతున్నారు. గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ కష్టపడుతున్నారు.
ఏడు పదుల వయసులోనూ చంద్రబాబు కష్టపడుతున్నారు. కానీ కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు ఆఫీస్ లో కూర్చుని అధికారులతో పని చేయిస్తే సరిపోతుంది, ఆయన ఫీల్డ్ లోకి దిగగానే 200 మంది అధికారులు ఆయనకి కాపలాగా మారారు. అదే అధికారులు ప్రజలకు సహాయం చెయ్యొచ్చు అంటూ విమర్శిస్తున్నారు.
ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ చెక్ పెడుతూ.. మేము వైసీపీ నేతలను విమర్శించడం లేదు. వాళ్ళు ఏంతో కొంత చేసుండాలి, కానీ చంద్రబాబు గారు ఈవయసులో బుల్డోజర్లు ఎక్కి చేరలేని ప్రదేశానికి వెళ్లి కష్టపడుతున్నారు. ట్రాక్టర్లు ఎక్కి, ప్రొక్లైన్స్ ఎక్కి కష్టపడుతుంటే ఆయన్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్.
వైసీపీ నేతలకు నా విన్నపం, నా విజ్ఞాపన.. మీరు విమర్శించడం కంటే ముందు ఇది అందరి ఉమ్మడి సమస్య, రాష్ట్ర సమస్య, బయటికి వచ్చి మీరు కూడా సహాయచర్యల్లో పాల్గొంటే బావుంటుంది. మూడు రోజులుగా నేను కనిపించడం లేదు అంటున్నారు. నేను వస్తే ఆ సహాయకచర్యల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇంకా నన్ను వైసీపీ నేతలు విమర్శించాలంటే ఎప్పుడైనా నాతోపాటు మీరు రావచ్చు, నా కాన్వాయ్ లో తీసుకెళ్తాను అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు గడ్డిపెట్టారు. అంతేకాదు మీరు విమర్శించాలంటే ముందు మీరు సహాయం చేసి మట్లాడండి అంటూ కాస్త గట్టిగానే పవన్ వారికి ఇచ్చి పడేసారు.