టాలీవుడ్ మాత్రమే కాదు సౌత్, నార్త్ భాషల్లో హీరోయిన్స్ గా ఫేమస్ అయ్యి అభిమానులను సంపాదించుకుని కోట్లలో పారితోషికాలు అందుకుంటున్న హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఏమైపోయారో అంటూ చాలామంది మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కారణం చాలానే ఉంది.
అదేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ప్రకృతి విపత్తుతో అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు వరదలతో ప్రజలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తల దాచుకోవడానికి గూడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానితో టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా ముందొచ్చి భారీ విరాళాలు ప్రకటిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు.
అయితే ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ హీరోల పక్కన నటిస్తూ పాపులర్ అయిన హీరోయిన్లు కూడా తమకు తోచినట్టుగా ప్రజలకు సహాయం చేస్తే బావుంటుంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్స్ తమ శక్తిమేర దాతృత్వం చూపిస్తే బావుండేది.. అందులో భాగంగానే పెద్ద పెద్ద హీరోయిన్స్ అంతా ఏమైపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు.
చిన్న హీరోయిన్ అయిన అనన్య నాగళ్ళ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 2.5 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.. అంటూ ప్రకటించడంతో.. ఈ పెద్ద హీరోయిన్స్ చర్చ మొదలైంది.